logo

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవానికి అంకురార్పణ

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.  బాలాజీ, శ్రీదేవి, భూదేవి సహిత ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు.

Updated : 01 Apr 2023 04:22 IST

పుట్టమన్ను తీసుకొస్తున్న పూజారులు, వేదపండితులు

మొయినాబాద్‌: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.  బాలాజీ, శ్రీదేవి, భూదేవి సహిత ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. ముందుగా ఆలయంలో సెల్వర్‌ కుత్తు నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేశారు. పుట్టబంగారం(పుట్టమన్ను) తీసుకొచ్చి హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. ఆలయ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌, కన్నయ్య, సురేష్‌, అనిల్‌స్వామిలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని