కొట్టేసిన తుపాకీ ఎక్కడ పేలుతుందో..?
ఓ దొంగ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నాడు. తొమ్మిదేళ్లు గా అజ్ఞాతంలో ఉంటూ చేతివాటం ప్రదర్శిస్తున్న ఈ ఘరానా దొంగ.. తాజాగా ఓ ఇంట్లో చేసిన చోరీ పోలీసు వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
నిందితుడు దాన్ని దుర్వినియోగం చేస్తాడేమోనని పోలీసుల ఆందోళన
ఈనాడు- హైదరాబాద్: ఓ దొంగ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నాడు. తొమ్మిదేళ్లు గా అజ్ఞాతంలో ఉంటూ చేతివాటం ప్రదర్శిస్తున్న ఈ ఘరానా దొంగ.. తాజాగా ఓ ఇంట్లో చేసిన చోరీ పోలీసు వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
అమ్మో.. రషీద్ ఖాన్..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రషీద్ ఖాన్.. కరడుగట్టిన నేరస్థుడు. సంగారెడ్డి, సైబరాబాద్, రాచకొండ పరిధిలో వందకుపైగా చోరీలు చేశాడు. సెల్‌ఫోన్ వాడకపోవడం ఇతని ప్రత్యేకత. ఒకేసారి మూడు, నాలుగు చోరీలు చేసి అజ్ఞాతంలోకి వెళ్తాడు. తాజాగా రాచకొండ పరిధిలో నాలుగు చోరీలు చేశాడు. కుషాయిగూడ పరిధిలో ఈనెల 14న ఓ వ్యాపారి ఇంట్లో రూ.8 లక్షలు, 40 తులాల బంగారం చోరీ ఇతని పనే. దానికి సరిగ్గా ఒక రోజు ముందే జవహర్‌నగర్‌లో ఒక మాజీ ఆర్మీ అధికారి ఇంట్లో చోరీ చేశాడు. ఇంట్లో సొత్తుతోపాటు తుపాకీ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. దాన్ని దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇతని స్టైలే వేరప్పా..
ఇళ్లలో ప్రధాన ద్వారానికి బదులు పడక గది కిటికీలు తొలగించి దోపిడీ చేయడం రషీద్ ప్రత్యేకత. కొత్తగా నిర్మించే ఇళ్లలో ఎక్కువగా యూపీవీసీ కిటికీలు బిగిస్తున్నారు. వీటిని అలవోకగా తొలగించడంలో నైపుణ్యం సంపాదించిన ఇతడు సరిగ్గా పడకగదిలోకి ప్రవేశిస్తున్నాడు. అంతకుముందుగా రెక్కీ చేస్తాడు. యజమానులు లేని సమయం చూసుకుని నగదు, ఆభరణాలు దొంగిలిస్తాడు. కుషాయిగూడ పరిధిలో తాజాగా జరిగిన చోరీ కేసులోనూ నిందితుడు ఇదే తరహాలో కిటికీ తెరిచాడు. రషీద్ ఖాన్ పట్టుబడితే రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఇళ్లలో జరిగే చోరీలు కొంత మేర అడ్డుకట్ట పడుతుందని ఉన్నతాధికారి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!