logo

చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి.

Updated : 19 Apr 2024 04:40 IST

కార్యక్రమంలో పాల్గొన్న పూజారులు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు అర్చకులు అంకురార్పణ చేశారు. ప్రధాన మండపంలో  ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. గరుడ ప్రసాద వితరణ నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడ ప్రసాదాన్ని స్వీకరించేందుకు మహిళలు విశేషంగా తరలిరానున్నారు. రెండో రోజు ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం నిర్వహించిన అనంతరం గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని సంతానభాగ్యం లేని మహిళలకు వితరణ చేయనున్నట్లు పూజారి సీఎస్‌ రంగరాజన్‌ తెలిపారు. బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎంవీ సౌందరరాజన్‌, కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, కన్నయ్యస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని