logo

రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం

వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించారు.

Updated : 19 Apr 2024 04:35 IST

రాఘవను సత్కరిస్తున్న చిరంజీవి, చిత్రంలో మురళీమోహన్‌, శిల్ప

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించారు. మహర్షి రాఘవను గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చిరంజీవి ఆహ్వానించారు. మరో సినీనటుడు మురళీమోహన్‌తో కలిసి మహర్షి రాఘవను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తాను 1998 అక్టోబరు 2న చిరంజీవి రక్తనిధి కేంద్రం ప్రారంభించినప్పుడు తొలిగా మురళీమోహన్‌ రక్తదానం చేశారని, రెండో దాత మహర్షి రాఘవని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టులో 50, 60 సార్లు రక్తదానం చేసిన దాతలున్నారని, అయితే క్రమం తప్పకుండా ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం చేయడం ఇదే ప్రథమమని కొనియాడారు. మురళీమోహన్‌ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ఎంతో ఆరోగ్యకరమని, యువత, దాతలు ఇదే తరహాలో ముందుకు రావాలని కోరారు.  చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించడం పట్ల మహర్షి రాఘవ, ఆయన సతీమణి శిల్ప ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని