logo

20 మంది ఒడిశా కార్మికులకు విముక్తి

జగిత్యాల జిల్లాలోని పలు ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులపై వేధింపులు పెరుగుతున్నాయి. ఈనెల 10న నూకపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులను యజమాని నిర్బంధించి, వేధింపులకు గురిచేసిన సంఘటన మరవక ముందే.. నూకపల్లి శివారులోని తిరుపతి అనే వ్యక్తికి చెందిన ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికులను వేధిస్తూ స్వగ్రామాలకు వెళ్లకుండా, జీతాలు చెల్లించకుండా పనిచేయిస్తున్న వైనాన్ని కార్మికులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.

Updated : 24 Mar 2023 04:44 IST

స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ఒడిశా కార్మికులు  

మల్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లాలోని పలు ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులపై వేధింపులు పెరుగుతున్నాయి. ఈనెల 10న నూకపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులను యజమాని నిర్బంధించి, వేధింపులకు గురిచేసిన సంఘటన మరవక ముందే.. నూకపల్లి శివారులోని తిరుపతి అనే వ్యక్తికి చెందిన ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికులను వేధిస్తూ స్వగ్రామాలకు వెళ్లకుండా, జీతాలు చెల్లించకుండా పనిచేయిస్తున్న వైనాన్ని కార్మికులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. గురువారం సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌, లేబర్‌ ఆఫీసర్‌ కృష్ణకుమార్‌, ఎస్సై చిరంజీవి ఇటుక బట్టీ వద్దకు వెళ్లి విచారణ జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వేధింపులను ఒడిశా కార్మికులు అధికారులకు వివరించారు. తమను స్వగ్రామాలకు వెళ్లకుండా బట్టీ యజమాని అడ్డుకుంటున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు కానిస్టేబుళ్ల సహకారంతో అధికారులు 13 మంది ఒడిశా కార్మికులను, వారి పిల్లలను స్వగ్రామాలకు పంపించారు. సంఘటనకు సంబంధించి ఇటుక బట్టీ యజమానితోపాటు మరో వ్యక్తిపై ఈనెల 21న మల్యాల ఠాణాలో కేసు కూడా నమోదైనట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు