logo

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లపై పోలీసుల నజర్‌

ప్రజాప్రతినిధులను కించపరిచేలా, వ్యక్తిగతంగా వారి గౌరవాన్ని భంగపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పలువురు పెట్టే పోస్ట్‌లు, కామెంట్లపై హైద్రాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు దృష్టి పెట్టారు

Published : 30 Mar 2023 06:27 IST

ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యువకులకు తాఖీదులు

ఈనాడు, కరీంనగర్‌: ప్రజాప్రతినిధులను కించపరిచేలా, వ్యక్తిగతంగా వారి గౌరవాన్ని భంగపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పలువురు పెట్టే పోస్ట్‌లు, కామెంట్లపై హైద్రాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే మూడు రోజుల కిందట ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యువకులకు 41ఏ కింద నోటీసులను అందించి హెచ్చరికల్ని జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలానికి చెందిన ఓ యువకుడితోపాటు జగిత్యాలకు చెందిన మరో యువకుడు యూట్యూబ్‌ ఛానెల్స్‌లో ప్రజాప్రతినిధులపై ట్రోల్‌ చేసిన సందర్భంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. సైబర్‌ క్రైం పోలీసులు కరీంనగర్‌, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరితోపాటు మరో 8 మందిని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇలాంటి పోస్ట్‌లను ఎవరు పెట్టొద్దని కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల పోలీసులు యువతను హెచ్చరికలతో అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి హైద్రాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు పంపించిన సమాచారాన్ని స్థానికంగా యువతకు తెలియజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని