logo

ఇసుక అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా

ఇసుక అక్రమ రవాణాపై నిఘా పటిష్ఠం చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ సూచించారు. మంగళవారం ఆయన సమీకృత పాలనా ప్రాంగణంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 26 ఇసుక రీచ్‌లుండగా టీఎస్‌ఎండీసీ పరిధిలో 18 చోట్ల తవ్వకాలు చేపడుతున్నారని వెల్లడించారు.

Published : 27 Mar 2024 03:10 IST

 దూరదృశ్య మాధ్యమ సమావేశంలో కలెక్టర్‌, అధికారులు
పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇసుక అక్రమ రవాణాపై నిఘా పటిష్ఠం చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ సూచించారు. మంగళవారం ఆయన సమీకృత పాలనా ప్రాంగణంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 26 ఇసుక రీచ్‌లుండగా టీఎస్‌ఎండీసీ పరిధిలో 18 చోట్ల తవ్వకాలు చేపడుతున్నారని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలు దాటితే రవాణాకు అనుమతి లేదన్నారు. అక్రమ రవాణాపై త్వరలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక అవసరాలకు పంచాయతీ కార్యదర్శి అనుమతితో గ్రామస్థులు ఇసుక తీసుకోవచ్చని సూచించారు. చెక్‌డ్యాంలకు 500 మీటర్ల దూరంలోపల ఇసుక తవ్వకాలు లేకుండా పర్యవేక్షించాలన్నారు. అక్రమ రవాణా అనుమానిత ప్రాంతాలను గుర్తించాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

 యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన దూరదృశ్య మాధ్యమ సమావేశానికి కలెక్టర్‌ సమీకృత పాలనా ప్రాంగణం నుంచి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 305 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 10లోగా అవసరమైన చోట్ల కొనుగోళ్లు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు