logo

ప్రాజెక్టుల పనులువేగవంతం చేయాలి

రాయలసీమలోని ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.. విస్తరణ పనులు దక్కించుకొన్న ఏజెన్సీలు నెమ్మదిగా చేస్తున్నాయని గుర్తించినట్లు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. తెలుగుగంగ, వెలుగోడు,

Published : 23 Jan 2022 02:16 IST

నందికొట్కూరు గ్రామీణం, పగిడ్యాల, న్యూస్‌టుడే: రాయలసీమలోని ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.. విస్తరణ పనులు దక్కించుకొన్న ఏజెన్సీలు నెమ్మదిగా చేస్తున్నాయని గుర్తించినట్లు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. తెలుగుగంగ, వెలుగోడు, కేసీ కెనాల్‌, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌, మల్యాల, ముచ్చుమర్రి ప్రాజెక్టులను శనివారం పరిశీలన చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రాయలసీమలోని నాలుగు జిల్లాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో జరుగుతున్న పనులను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడంతోపాటు, రాయలసీమలో జరిగే పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వెలుగోడు జలాశయం కింద పంటలు సాగు చేసుకున్న రైతులకు నీళ్లిచ్చే విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడేలా ఒక నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టరును కోరతామన్నారు. ఆయన వెంట పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జలనవరులశాఖ సీఈ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, తెలుగుగంగ ఈఈ సుబ్బరాయుడు హాజరై నీటి సామర్థ్యం, కాల్వల ద్వారా వదులుతున్న నీటి వివరాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని