logo

Lakshminarayana: మనం రాజనీతి మార్గంలో నడుద్దాం: లక్ష్మీనారాయణ

ప్రస్తుత రాజకీయాలపై  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Lakshminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 30 Oct 2023 12:06 IST

నంద్యాల: ప్రస్తుత రాజకీయాలపై  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Lakshminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సంఘం వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రస్తుతం రాజనీతి శాస్త్రం.. రాజకీయ శాస్త్రంగా మరిందన్నారు. ఇప్పుడున్న రాజకీయాలు ప్రజలను ఏమార్చే రాజకీయాలుగా విశ్లేషించారు. రాజనీతిని నమ్ముకున్న వాళ్లం మనం.. మళ్లీ రాజనీతిని తీసుకురావడానికి ఇంకా చాలా కష్టపడాలని పూర్వ విద్యార్థుల సంఘానికి ఆయన సూచించారు.

‘‘మన జీవితాలను ప్రభావితం చేసేది రాజకీయాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రాజకీయాలు నిర్ణయిస్తున్నాయి. మనకు రాజకీయాలకు సంబంధం లేదనుకుంటే అలాగే ఉండిపోతాం. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మనం రాజనీతి మార్గంలో నడుద్దాం. అవసరమైనప్పుడు ఎక్కడ గొంతు వినిపించాలో అక్కడ వినిపిద్దాం. మనకు స్వార్థం లేదు, ఆస్తులు  సంపాదించాలని ఆకాంక్ష లేదు. కేవలం ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే మన ధ్యేయం’’ అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని