logo

కన్నుల పండుగగా బెలడోనా భీమలింగేశ్వర స్వామి రథోత్సవం

మండలంలోని బెలడోనా గ్రామంలో వెలిసిన భీమ లింగేశ్వర స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది.

Updated : 25 Apr 2024 22:41 IST

చిప్పగిరి: మండలంలోని బెలడోనా గ్రామంలో వెలిసిన భీమ లింగేశ్వర స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు రామనాథశాస్త్రి ఆధ్వర్యంలో సంప్రదాయబద్దంగా రథోత్సవాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. బెలడోనా నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ప్రభుత్వంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కోనంకి వెంకటేష్, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి సతీష్, సర్పంచ్ పార్వతమ్మ,, మాజీ  సర్పంచ్ భీమ లింగప్ప చౌదరి, రైల్వే కాంట్రాక్టర్ భీమ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని