logo

ఆర్థికంగా స్థిరపడాలని ఏలూరు నుంచి వచ్చి.. అనంతలోకాలకు!

ఆర్థికంగా స్థిరపడేందుకు రాష్ట్రం దాటొచ్చి.. పని చేసుకుంటున్న యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం తుమ్మిళ్ల శివారులో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 30 Jun 2023 08:15 IST

చైతన్యకుమార్‌

రాజోలి, న్యూస్‌టుడే: ఆర్థికంగా స్థిరపడేందుకు రాష్ట్రం దాటొచ్చి.. పని చేసుకుంటున్న యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల శివారులో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లా పత్తికోల లంక గ్రామానికి చెందిన చైతన్య కుమార్‌(28) బీటెక్‌ పూర్తి చేసి, ప్రైవేటుగా ఉద్యోగం చేసేవారు. ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో కుటుంబంతో కలసి ఆరు నెలల కిందట జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి వచ్చారు. తుమ్మిళ్ల శివారులో చేపల చెరువులను లీజుకు తీసుకొని పెంపకం చేపడుతున్నారు. రోజూ లాగే గురువారం బొలేరో వాహనంలో చేపలకు ఆహారం తీసుకొచ్చి, రివర్సులో ఉంచాడు. వాహనం అదుపు తప్పి చెరువులోకి వెళ్లసాగింది. ముందు టైర్లు పైకి లేయడంతో బోల్తా పడుతోందని గుర్తించిన చైతన్య, డోరు తీసి దూకే ప్రయత్నం చేశాడు. ఆలోపే పూర్తిగా బోల్తా పడటంతో డోరు, వాహనం మధ్యలో ఇరుక్కొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. భార్య రూపవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా హెడ్‌కానిస్టేబుల్‌ వివరించారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చెరువులో బోల్తా పడిన వాహనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని