logo

ఆ ముగ్గురూ ఖరారు..

నామినేషన్‌ దాఖలుకు ఆఖరిరోజున భాజపా ఉమ్మడి జిల్లాలో మూడుస్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వారి వ్యక్తి‘గతం’ ఇదీ...!

Published : 11 Nov 2023 06:16 IST

నామినేషన్‌ దాఖలుకు ఆఖరిరోజున భాజపా ఉమ్మడి జిల్లాలో మూడుస్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వారి వ్యక్తి‘గతం’ ఇదీ...!

నియోజకవర్గం : దేవరకద్ర
అభ్యర్థి : కొండ ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
తల్లిదండ్రులు : కొండ విజయలక్ష్మి, కొండ సూర్యప్రతాప్‌రెడ్డి
పుట్టిన తేదీ : 18-04-1984
స్వస్థలం : దేవరకద్ర
విద్యాభ్యాసం : డిగ్రీ(బీఎస్సీ)
వృత్తి : రాజకీయం, వ్యాపారం
రాజకీయ ప్రవేశం : 2014 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన వివిధ పార్టీ పదవులు చేపట్టారు. ఇటీవలి వరకు టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఉన్న ఆయన దేవరకద్ర నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించారు. డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డికి టికెట్‌ ఖరారు చేయటంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. భాజపా నుంచి టికెట్‌ సాధించారు.


పేరు: పెరుమాళ్ల రాజగోపాల్‌
పుట్టినతేది: 10.9.1959
స్వగ్రామం: అలంపూర్‌
చదువు: ఎం.కాం..ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌
వృతి: బ్యాంక్‌ అఫ్‌ బరోడా చీఫ్‌  మేనేజర్‌  రాజకీయ రంగప్రవేశం: 9.3.2021, భాజపా అధికార ప్రతినిధిగా.. భార్య: క్రాంతి  
కుమార్తెలు: డా.సాయిసాహితి, సాయి రచన (డిజిటల్‌ టెక్నాలజి డైరెక్టర్‌ యూఎస్‌ఏ)
కుమారుడు సాయిశరత్‌: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (యూఎస్‌ఏ)
తల్లిదండ్రులు: కిష్టన్న, నారాయణమ్మ.
నేపథ్యం: 20 ఏళ్లపాటు బ్యాంక్‌ యూనియన్‌ లీడర్‌గా పనిచేశారు. 1 నుంచి 10 వరకు అలంపూర్‌.. డిగ్రీ నుంచి ఎంకాం వరకు ఉస్మానియా యూనివర్సిటి హైదరాబాద్‌

న్యూస్‌టుడే, శాంతినగర్‌


పేరు : అనుజ్ఞారెడ్డి
చదువు : బీటెక్‌, ఎంస్‌ (అమెరికా)
వృత్తి : విద్యాసంస్థల నిర్వహణ
కుటుంబ నేపధ్యం : స్వాతి (భార్య), ఆదిత్య (కుమారుడు), ఆరాధ్యగాయత్రి (కుమార్తె)
రాజకీయ ప్రవేశం : 2005 నుంచి 2011 వరకు అమెరికాలో గూగుల్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేశారు. అనంతరం వనపర్తిలో ఆయన తల్లిదండ్రులు అరుణ, వెంగళ్‌రెడ్డి నిర్వహిస్తున్న విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. 2019లో భాజపాలో చేరారు. 2020లో వనపర్తిలో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడి పోయారు. ప్రస్తుతం వనపర్తి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నారు.

 న్యూస్‌టుడే, వనపర్తి న్యూటౌన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు