logo

సీతారాముల కల్యాణానికి ముస్తాబు

రాజోలి మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు.

Published : 16 Apr 2024 17:17 IST

రాజోలి: రాజోలి మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. 8 గ్రామ పంచాయతీల్లో ఉన్న రామాలయాలతో పాటు, ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభంగా నిర్వహించడం కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం పెద్దతాండ్రపాడు గ్రామంలో రాములవారి ఆలయ నిర్వాహకులు ఉదయం స్వామికి సాంప్రదాయ బద్దంగా పుట్టమన్ను తీసుకొచ్చి పందిరి వేశారు. కుంభంకాగు ఊరేగింపు, పట్టు వస్త్రాల సమర్పణ చేశారు. అలాగే మిగిలిన గ్రామాల్లో ఆలయాలను కల్యాణం కోసం రంగులు వేసి, విద్యుత్తు దీపాలతో అలంకరించారు. రాజోలి గ్రామంలోని రెండు ఆలయాల్లో, ముండ్లదిన్నె, అశోక్ నగర్, పచ్చర్ల, నసనూరు, చిన్నధన్వాడ, తుమ్మలపల్లి గ్రామాల్లోనూ కల్యాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు