logo

ఆఫర్‌ పేరిట టోకరా..

పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎక్కడో చోట సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో నేరగాళ్లు బురడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో జగదేవపూర్‌ మండలం తిమ్మాపూర్‌లో

Published : 03 Jul 2022 01:37 IST

ఆగని సైబర్‌  నేరాలు

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎక్కడో చోట సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో నేరగాళ్లు బురడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో జగదేవపూర్‌ మండలం తిమ్మాపూర్‌లో ఘటన చోటుచేసుకుంది. గత నెల 26న గ్రామానికి చెందిన చిప్ప నరేందర్‌ అనే యువకుడికి ఓ సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేశాడు. ల్యాప్‌టాప్‌, చరవాణులు 50 శాతం తక్కువ ధరకే ఆఫర్‌లో అందిస్తామని వాటి ఫొటోలు పంపాడు. రూ.70 వేలు వెంటనే పంపించాలని సూచించాడు. నమ్మిన యువకుడు ఫోన్‌పే ద్వారా రూ.70 వేల పంపించాడు. తర్వాత రెండు రోజులకు అదే నెంబరుకు ఫోన్‌ చేయగా ఏమ్రాతం స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించి గత నెల 30న జాతీయ హెల్ప్‌లైన్‌ 1930కు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడికి చెందిన రూ.11,000 ఫ్రీజ్‌ అయినట్లు పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. 24 గంటలోపు సమాచారం ఇస్తే 99 శాతం మేర సొమ్ము రికవరీ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని