logo

రక్షణ దళం..

దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్‌ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే మగ్గిపోయింది. అప్పట్లో రజాకార్ల అరాచకాలు చెప్పనలవి కానివి. స్వాతంత్రోద్యమాన్ని మహాత్మాగాంధీ అహింస అనే ఆయుధంతో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి

Published : 14 Aug 2022 01:46 IST

కర్రలతో స్వాగతం పలుకుతూ..

దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్‌ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే మగ్గిపోయింది. అప్పట్లో రజాకార్ల అరాచకాలు చెప్పనలవి కానివి. స్వాతంత్రోద్యమాన్ని మహాత్మాగాంధీ అహింస అనే ఆయుధంతో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కొనసాగించారు. చివరకు స్వేచ్ఛ లభించింది. ఇక హైదరాబాద్‌ సంస్థానం విముక్తి కోసం స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిగా ప్రజలు కదం తొక్కారు. నాటి కాంగ్రెస్‌ నాయకుడు రామానందతీర్థ నిజాం పాలనలో ప్రజలు పడుతున్న పాట్లను తెలుసుకునేందుకు 1948లో వికారాబాద్‌లో పర్యటించారు. ఆ సమయంలో గ్రామాల్లోని యువకులు ఆయనకు కర్రలతో స్వాగతం పలికారు. రామానంద తీర్థ యువకులతో సమావేశమై రజాకార్ల ఆగడాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే గ్రామానికో రక్షణ దళాన్ని ఏర్పాటు చేయించి పోరాట బాట పట్టించారు. చివరకు 1948 సెప్టెంబరులో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ చేపట్టిన సైనిక చర్యతో విముక్తి లభించింది. - న్యూస్‌టుడే, వికారాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని