logo

హుజూర్‌నగర్‌ నుంచి సరోజినీనాయుడి కుమారుడు విజయం

దేశంలో 1952 నాటికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో.. రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడి కుమారుడు, అంతర్జాతీయ మానవ హక్కుల నాయకుడు డాక్టర్‌ ముత్యాల జయసూర్య నాయుడు నాయకత్వంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) రాజకీయ పార్టీని స్థాపించి 48 శాసనసభ, ఏడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించారు.

Published : 29 Oct 2023 04:09 IST

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం: దేశంలో 1952 నాటికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో.. రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడి కుమారుడు, అంతర్జాతీయ మానవ హక్కుల నాయకుడు డాక్టర్‌ ముత్యాల జయసూర్య నాయుడు నాయకత్వంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) రాజకీయ పార్టీని స్థాపించి 48 శాసనసభ, ఏడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించారు. జయసూర్య మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు, హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. అనంతరం హుజూర్‌నగర్‌ శాసనసభా స్థానానికి రాజీనామా చేసి మెదక్‌ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని