logo

949 మందికి ఐసోలేషన్‌ కిట్లు

జ్వర సర్వేలో భాగంగా జిల్లాలో ఆదివారం 949 మందికి ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. ఓపీ విభాగంలో 110, సర్వేలో 839 మందికి ఇచ్చారు. 889 బృందాలు క్షేత్రస్థాయిలో వివరాలు ఆరా తీశాయి. జ్వరం, జలుబు,.....

Published : 24 Jan 2022 04:08 IST

జిల్లాకేంద్రంలో సర్వే చేపట్టిన వైద్య బృందం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జ్వర సర్వేలో భాగంగా జిల్లాలో ఆదివారం 949 మందికి ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. ఓపీ విభాగంలో 110, సర్వేలో 839 మందికి ఇచ్చారు. 889 బృందాలు క్షేత్రస్థాయిలో వివరాలు ఆరా తీశాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడేవారికి ఔషధాలు అందజేశారు. మరో రెండు రోజుల పాటు సర్వే జరగనుందని అధికారులు వెల్లడించారు.

ఇంటింటికి వెళ్తూ..

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతోంది. పంచాయతీ, వైద్యఆరోగ్య, మున్సిపల్‌ సిబ్బంది సంయుక్తంగా సర్వే చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి దగ్గు, జలుబు, జ్వరం ఉందా అనే వివరాలు తెలుసుకుంటున్నారు. సర్వేకు 1,238 బృందాలు నియమించారు. మొత్తం 3,48,731 ఇళ్లు ఉండగా మూడ్రోజుల్లో 2,82,007 ఇళ్లలో 10,88,476 మందిని పరీక్షించి 5,686 మందికి జ్వరాలు ఉన్నట్లుగా తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని