logo

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు కొత్త ఉపకార వేతనాలకు, పాతవి నవీకరణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి రజిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌

Published : 17 Aug 2022 02:46 IST

కామారెడ్డి కలెక్టరేట్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు కొత్త ఉపకార వేతనాలకు, పాతవి నవీకరణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి రజిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అక్టోబరు 15 వరకు సమర్పించాలని సూచించారు.
కామారెడ్డి కలెక్టరేట్‌: ఉపకార వేతనాల కోసం విద్యార్థుల చేసుకున్న దరఖాస్తులను ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు/పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు పరిశీలించి మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయం లాగిన్‌కు పంపించాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి దయానంద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రి మెట్రిక్‌ అక్టోబరు 16 వరకు, పోస్ట్‌మెట్రిక్‌ నవంబరు 15, మెరిట్‌ కం మీన్స్‌ నవంబరు 15, బేగం హజ్రత్‌ మహల్‌ దరఖాస్తులను అక్టోబరు 16 వరకు పంపించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు అల్పసంఖ్యాక కార్యాలయం నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పొందాలని తెలిపారు.


ఇద్దరికి డాక్టరేట్‌  

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెవివిలో ఇద్దరికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. వృక్షశాస్త్ర విభాగంలో పోతరాజు ‘ఇకలాజికల్‌ అండ్‌ పైటోప్లాంక్టానిక్‌ స్టడీస్‌ ఆఫ్‌ మేడ్చల్‌ లేక్‌ ఇన్‌ తెలంగాణ’ అనే అంశంపై.. ఆచార్య అరుణ పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో గంధం రాజు ‘ఇన్వెస్టర్‌ బిహేవియర్‌ టువార్డ్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌-ఏ స్టడీ ఇన్‌ హనుమకొండ’ అనే అంశంపై సహ ఆచార్యులు రాజేశ్వర్‌ పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని