logo

ట్రేడ్‌ లైసెన్సుల పునరుద్ధరణ అంతంతే

‘‘జిల్లాకేంద్రంలో ట్రేడ్‌ లైసెన్సుల పునరుద్ధరణ అంతంతమాత్రంగానే ఉంది. అనుమతి ఇచ్చే విధానంలో చోటు చేసుకున్న మార్పుతో బెంబేలెత్తిన వ్యాపారులు కోర్టు మెట్లెక్కడంతో ఈ సమస్య నెలకొంది.’’

Published : 30 Jan 2023 03:04 IST

ఛార్జీలు పెంచారని కోర్టు మెట్లెక్కిన వ్యాపారులు
అనుమతుల్లో ప్రధాన వాణిజ్య సంస్థలే స్పందన

జిల్లా కేంద్రంలోని సుభాష్‌చౌక్‌ ప్రాంతం

‘‘జిల్లాకేంద్రంలో ట్రేడ్‌ లైసెన్సుల పునరుద్ధరణ అంతంతమాత్రంగానే ఉంది. అనుమతి ఇచ్చే విధానంలో చోటు చేసుకున్న మార్పుతో బెంబేలెత్తిన వ్యాపారులు కోర్టు మెట్లెక్కడంతో ఈ సమస్య నెలకొంది.’’

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

ఈ ఆర్థిక సంవత్సరం వ్యాపార అనుమతులు పొందే విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దుకాణాల కొలతల ఆధారంగా పన్నులు విధిస్తున్నారు. దీనికి తోడు ప్రతి లైసెన్సుకు అదనంగా రూ.వెయ్యి హరిత పన్ను వేస్తున్నారు. ఫలితంగా గతంలో రూ.500 ఉండే పన్ను ప్రస్తుతం రూ.3 వేల దాకా పెరిగింది. ఇక వ్యాపార కేంద్రాల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నచోట రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకోవడంతో వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

ఇదీ పరిస్థితి

జిల్లాకేంద్రంలో 3 వేల వరకు దుకాణాలు ఉన్నాయి. ప్రధాన వాణిజ్య ప్రాంతాలైన సుభాష్‌రోడ్డు, తిలక్‌, జేపీఎన్‌, స్టేషన్‌, ప్రియా థియేటర్‌, అశోక్‌నగర్‌ ప్రధాన, సిరిసిల్ల రోడ్లతోపాటు రామారెడ్డి, నిజాంసాగర్‌ చౌరస్తా, ఇందిరాచౌక్‌, పాత- కొత్తబస్టాండ్లు, అంతర్గత కాలనీల్లో వేయి వరకు వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి నుంచి సుమారు రూ.30 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 30 శాతమే వసూలైంది.

ఆదాయం తగ్గింది - రవీందర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

ట్రేడ్‌ లైసెన్సుల విషయంలో కొత్త నిబంధనలు వ్యాపారులకు మింగుడుపడక కోర్టును ఆశ్రయించారు. బ్యాంకు రుణాలు, అత్యవసరం అనుకున్నవారు మాత్రమే కార్యాలయానికి వచ్చి లైసెన్సులు పొందుతున్నారు. మిగతా వారి వద్దకు బల్దియా సిబ్బంది వెళ్లడం లేదు. ఫలితంగా ఈ ఏడాది ట్రేడ్‌ లైసెన్సుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని