logo

ప్రణాళికతో సద్వినియోగం

సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు.

Updated : 24 Apr 2024 06:44 IST

ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి విద్యాశాఖ
నేటి నుంచి బడులకు వేసవి సెలవులు

కేరింతలు కొడుతున్న అమ్రాద్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. ముఖ్యంగా వేసవి సెలవులు ఎంత సరదా తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తగా ఉంటే అంతకుమించి ప్రమాదాలు జరుగుతాయి. అలవాట్లు, ఆహారం, ఆరోగ్యం, చదువు తదితర అంశాలను ఓ ప్రణాళిక ప్రకారం విభజించుకుంటే సెలవుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులంతా బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెంచేందుకు అందరూ కృషి చేయాలి. సెలవుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. విద్యార్థులు సెలవుల్ని మంచి వ్యాపకాల కోసం సద్వినియోగం చేసుకోవాలి.

దుర్గాప్రసాద్‌, డీఈవో

విద్యార్థులకు సూచనలు

ఆరుబయట ఉదయం, సాయంత్రం మాత్రమే ఆడుకోవాలి. చెరువులు, కుంటలు, బావులు, నదుల్లో ఈతకు వెళ్లకపోవడం ఉత్తమమన్నారు. * మంచినీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీళ్లు తీసుకోవాలి.

  • ఎండాకాలం దృష్ట్యా శరీరానికి గాలి తగిలేలా కాటన్‌ దుస్తులు ధరించాలి. బయటకి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపి, నీళ్లసీసా తీసుకువెళ్లాలి.
  • వీలైనన్ని కథలు, జీవిత చరిత్ర పుస్తకాలు చదవడంతో పాటు చిత్రలేఖనంపై దృష్టి పెట్టాలని సూచించింది.
  • సెలవుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ ఇళ్లకు పంపాలని, వీలైతే తల్లిదండ్రులు తమ పని ప్రదేశానికి తీసుకువెళ్లాలని, తద్వారా వారు పడుతున్న కష్టాలు తెలుస్తాయని, తల్లిదండ్రులు వారి బాల్యంలో జ్ఞాపకాలను చిన్నారులతో పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా టీవీలు, చరవాణులకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి.

ఉపాధ్యాయులు చేయాల్సింది

చివరి పనిదినం మొదలు పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాల్సిన పనులపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. 2 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చివరి తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్ని తప్పనిసరి పై తరగతుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలి. 2 మధ్యాహ్న భోజన బియ్యం నిల్వలు పాడవకుండా చర్యలు చేపట్టాలి. 2 ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో జిల్లాలో 770 బడుల్లో పనులను గుర్తించి రూ.39.38 కోట్ల నిధులు కేటాయించారు. ఆ పనులను ఎప్పటికప్పుడు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించి, పునఃప్రారంభానికి పూర్తి చేయించాలి.2 పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌, రాత పుస్తకాలను జిల్లా గోదాముకి వచ్చిన వెంటనే అక్కడి నుంచి మండల, పాఠశాల స్థాయికి సరఫరా చేయాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని