logo

రాములోరి కల్యాణం చూద్దాం రారండి

శ్రీరామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Published : 17 Apr 2024 04:49 IST

 అలంకరణలో ఉత్సవమూర్తులు
నెల్లిమర్ల, న్యూస్‌టుడే: శ్రీరామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్సవాల పర్యవేక్షణకు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాస్‌మూర్తిని దేవదాయ శాఖ నియమించింది. కల్యాణానికి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు  ప్రత్యేక ఆహ్వానం పలికారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ విచ్చేయనున్నారు.

ప్రత్యేక సదుపాయాలు

 స్వామి కల్యాణం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తారు. మండపేట కొబ్బరి బొండాలు, గోటితో ఒలిచిన తలంబ్రాలు, ప్రత్యేక తీపి పదార్థాలతో కూడిన కంత ఆకర్షణగా నిలవనున్నాయి. సుమారు 10 వేల మంది భక్తుల కోసం ఇప్పటికే కల్యాణ వేదికను సిద్ధం చేశారు. దేవస్థానం ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు 10 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు. అనంతరం వారికి స్వామివారి ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేయనున్నట్లు ఈవో వై.శ్రీనివాసరావు తెలిపారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని