logo

ప్రలోభాలకు లొంగొద్దు

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని.. అటువంటి వజ్రాయుధాన్ని ప్రలోభాలకు లొంగి ఓడనీయొద్దని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

Published : 16 Apr 2024 04:04 IST

కొమరోలు మండలం తాటిచెర్ల వాసులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌

గిద్దలూరు పట్టణం, కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని.. అటువంటి వజ్రాయుధాన్ని ప్రలోభాలకు లొంగి ఓడనీయొద్దని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ , ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సూచించారు. కొమరోలు మండలం తాటిచెర్లలో సోమవారం పర్యటించారు. ఓటు హక్కు వినియోగంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పౌరులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

  • గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్‌, ఎస్పీ సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్‌ పత్రాలు నింపిన తర్వాత సిబ్బందికి అందిస్తే పరిశీలించి తప్పిదాలుంటే తెలుపుతారన్నారు. ప్రచారాలకు ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తిస్తే చరవాణి నంబరు 91211 02266కు ఫిర్యాదు చేయాలని కోరారు. సీవిజిల్‌ యాప్‌లోనూ ఫిర్యాదులు అందజేయవచ్చని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకుగాను ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. తొలుత గిద్దలూరు సెయింట్‌పాల్స్‌ బీఈడీ కళాశాల ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంను కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి డి.నాగజ్యోతి, డీఎస్పీ బాలసుందరరావు, సీఐ సోమయ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు