logo

మూడంచెల్లో పటిష్ఠ భద్రత

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు భద్రతపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ తెలిపారు.

Published : 17 Apr 2024 03:42 IST

భద్రతా ఏర్పాట్లపై సింగరాయకొండ సీఐ రంగనాథ్‌తో చర్చిస్తున్న ఎస్పీ సుమిత్‌ సునీల్‌, చిత్రంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు భద్రతపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన ట్రిపుల్‌ ఐటీ, ఒంగోలు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు ఉంచిన రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయా కేంద్రాల వద్ద 24/7 సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ఎక్కడా విఘాతం కలగకుండా బారికేడ్లు సిద్ధం చేయాలన్నారు. ఆయా కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతో భద్రత కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఆర్డీవో సుబ్బారెడ్డి, ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు, ఒంగోలు తాలూకా, సింగరాయకొండ సీఐలు పి.భక్తవత్సలరెడ్డి, డి.రంగనాథ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు