logo

మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా మత్స్యకారులు ఎస్‌.స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ద్వారా వారం రోజుల పాటు తమిళనాడులోని పూంపుహార్‌ ప్రాంతంలో ఫిష్‌ ఫర్‌ ఆల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు.

Updated : 17 Aug 2022 07:12 IST

జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా మత్స్యకారులు ఎస్‌.స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ద్వారా వారం రోజుల పాటు తమిళనాడులోని పూంపుహార్‌ ప్రాంతంలో ఫిష్‌ ఫర్‌ ఆల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. మొత్తం 33 మంది శిక్షణకు మంగళవారం బస్సులో బయల్దేరారు. దాన్ని కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయస్థాయిలో మత్స్యకారులు శిక్షణకుగాను ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇదే మొదటిసారి అని ఇలాంటి అవకాశం శ్రీకాకుళం జిల్లాకు లభించడం గర్వకారణమన్నారు. వారం రోజుల పాటు శిక్షణ జరుగుతుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ పి.వి.శ్రీనివాస్‌, వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు నేతాజీ, మత్స్యకార సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని