logo

Vishal: విశాల్‌ కొత్త రాజకీయ పార్టీ?

ప్రముఖ నటుడు విశాల్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. ఆయన మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు.

Updated : 07 Feb 2024 08:19 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రముఖ నటుడు విశాల్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. ఆయన మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్‌ తిరస్కరించారు. తన అభిమాన సంఘాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’(విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించారు. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు విశాల్‌ అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ, పరిష్కరిస్తూ వస్తున్నారు. త్వరలో విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు సమాచారం. వారితో మాట్లాడి పార్టీని విశాల్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్‌లాగే విశాల్‌ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని