logo

ఖజానా శాఖ ఉద్యోగులపై ఒత్తిడి

పీఆర్సీ జీఓల ప్రకారం జనవరి నెల జీతాలను ఫిబ్రవరి నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. జిల్లా స్థాయిలో ఖజానా శాఖ ఉద్యోగులు, ఎస్టీఓలు సహకరిస్తే సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కొత్త వేతనాలు చెల్లించేందుకు

Published : 26 Jan 2022 04:10 IST

నూతన పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఆదేశాలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పీఆర్సీ జీఓల ప్రకారం జనవరి నెల జీతాలను ఫిబ్రవరి నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. జిల్లా స్థాయిలో ఖజానా శాఖ ఉద్యోగులు, ఎస్టీఓలు సహకరిస్తే సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కొత్త వేతనాలు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఆ దిశగా ఖజానా శాఖ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొత్త జీవోలు అమలుకు ఖజానాశాఖ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. అంతేకాకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో కొత్త జీవోల ప్రకారం జీతాలు చెల్లించేందుకు సిద్ధమవ్వాలని ఖజానా ఉద్యోగులకు ఆ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. విషయం తెలుసుకున్న పీఆర్సీ సాధన సమితి నాయకులు కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఖజానా కార్యాలయానికి వెళ్లారు. ఆ శాఖ డీడీతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్‌లో మాట్లాడామని ఎట్టి పరిస్థితిలో ఉద్యోగులపై ఒత్తిడి తేవద్దని, పాత జీఓల ప్రకారం జీతాలు చెల్లించాలని కోరామని ఈశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని