logo

అంతర్గత బదిలీలకు నేడు కౌన్సెలింగ్‌

మహా విశాఖ నగరపాలక సంస్థలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్‌ అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు, రెవెన్యూ అధికారులు, అకౌంట్స్‌ అధికారులకు అంతర్గత బదిలీలు నిర్వహించడానికి జీవీఎంసీ కమిషనర్‌

Published : 28 May 2022 04:14 IST

కుర్చీలకు అతుక్కుపోవడానికి పైరవీలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్‌ అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు, రెవెన్యూ అధికారులు, అకౌంట్స్‌ అధికారులకు అంతర్గత బదిలీలు నిర్వహించడానికి జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ సమాయత్తమయ్యారు. ఒకే సీట్లో మూడేళ్లు పూర్తి చేసుకున్నవారంతా కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని శుక్రవారం కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. జోనల్‌ కమిషనర్లు, విభాగాధిపతుల వద్ద మూడేళ్లు పని చేసిన ఉద్యోగులను ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించనున్న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. దీంతో ఏళ్ల తరబడి జోన్లలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది తిరిగి అదే సీట్లలో ఉండటానికి పైరవీలు ప్రారంభించారు. విభాగాధిపతుల ద్వారా పరిపాలన విభాగానికి చెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వాటికి తలొగ్గకుండా మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేస్తే తప్ప జీవీఎంసీలో అవినీతి తగ్గే అవకాశాల్లేవనే సూచనలు వస్తున్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఇతర స్థానానికి బదిలీ కోరుకునే వెసులుబాటు ఉంటుంది. కమిషనర్‌ ఆదేశాల మేరకు అందరినీ బదిలీ చేస్తారా లేక కొంత మందిని విడిచిపెడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని