logo

ఆహార తయారీ పరిశ్రమలకు రాయితీలు

సూక్ష్మ ఆహార తయారీ పరిశ్రమల ఏర్పాటుకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు నాబార్డు ఏజీఎం ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గురువారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు నాబార్డ్‌ ఆధ్వర్యంలో

Published : 24 Jun 2022 04:55 IST

మాట్లాడుతున్న డైసీ, శ్రీనివాసరావు

అనకాపల్లి, న్యూస్‌టుడే: సూక్ష్మ ఆహార తయారీ పరిశ్రమల ఏర్పాటుకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు నాబార్డు ఏజీఎం ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గురువారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు నాబార్డ్‌ ఆధ్వర్యంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ పరిశ్రమల స్థాపన పథకం కింద ఈ రాయితీ లభిస్తుందని తెలిపారు. దీనిపై చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ డైసీ మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు చేసేవారు కేవలం 10 శాతం పెట్టుబడిగా పెడితే చాలన్నారు. మిగిలిన మొత్తం 35 శాతం రాయితీ, 55 శాతం బ్యాంకు రుణంగా లభిస్తుందని చెప్పారు. దేశంలో పదివేల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారన్నారు. పథకం రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.జె.మారుతి మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల పరిశ్రమలో లాభాలు బాగుంటాయన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.   లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మూర్తి, పథకం నోడల్‌ అధికారి రెహమాన్‌ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని