logo

మతోన్మాద శక్తులను ఓడించాలి

రాజ్యాంగ విలువలను, స్వాతంత్రోద్యమ లక్ష్యాలను దెబ్బతీస్తున్న మతోన్మాద బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులను ఓడించాలని సీపీఎం పొలిట్‌బ్యూర్‌ సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రలో జిల్లా సీపీఎం

Published : 12 Aug 2022 06:07 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

డాబాగార్డెన్‌్్స, న్యూస్‌టుడే: రాజ్యాంగ విలువలను, స్వాతంత్రోద్యమ లక్ష్యాలను దెబ్బతీస్తున్న మతోన్మాద బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులను ఓడించాలని సీపీఎం పొలిట్‌బ్యూర్‌ సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రలో జిల్లా సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎం.పద్మ అధ్యక్షతన ‘భారత స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల త్యాగాలు.. నేటి పరిస్థితుల’పై జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. మోదీ పాలనతో దళితులపై దాడులు 300 రెట్లు, మహిళలపై అత్యాచారాలు 250 శాతం పెరిగాయన్నారు. జాతీయోద్యమ వారసత్వానికి జరుగుతున్న ప్రమాదం నుంచి రక్షించుకోవాలన్నారు. రాష్ట్రాల హక్కులను పూర్తిగా నాశనం చేస్తున్నారన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల్గిన ఫెడరలిజం, లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఇస్లామిక్‌ దేశాల వలే హిందూ ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకుంటుందన్నారు. వాక్‌ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసేందుకు ఎన్‌ఐఏ, ఈడీలను ప్రభుత్వం ప్రయోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ నరసింగరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, బొట్టా ఈశ్వరమ్మ, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, బి.గంగారావు, వీఎస్‌ పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts