logo

అక్రమ తవ్వకాలపై రూ.95 లక్షల అపరాధ రుసుం

జిల్లాలో నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి రూ. 95 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశామని గనుల శాఖ సహాయ సంచాలకులు సుబ్బారాయుడు వెల్లడించారు.

Published : 07 Dec 2022 03:05 IST

భోగాపురం వద్ద సర్పంచితో మాట్లాడుతున్న ఏడీ సుబ్బారాయుడు

రోలుగుంట, న్యూస్‌టుడే: జిల్లాలో నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి రూ. 95 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశామని గనుల శాఖ సహాయ సంచాలకులు సుబ్బారాయుడు వెల్లడించారు. ఇటీవల ఎం.కె.పట్నం శివారు ఛటర్జీపురం వద్ద అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు, స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందాయి. ఆ క్వారీలను పరిశీలించడానికి ఆయన మంగళవారం రోలుగుంట వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఛటర్జీపురం వద్ద గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టిన వారికి నోటీసులిస్తామన్నారు. కంచుగుమ్మల శివారు భోగాపురం వద్ద రహదారి అధ్వానంగా తయారైందని, దీనికి తాత్కాలిక పరిష్కారం చూపాలని కంచుగుమ్మల సర్పంచి బండారు శ్రీనివాసరావు, మాజీసర్పంచి రాజేశ్వరి తదితరులు కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఏడీ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని