logo

నీటిశుద్ధి కేంద్రాల్లో ‘విజిలెన్స్‌’ తనిఖీలు

నగర పరిధిలోని నీటిశుద్ధి కేంద్రాల (ఆర్వోప్లాంట్ల) నిర్వహణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం విజిలెన్స్‌ ప్రాంతీయ అధికారి జి. స్వరూపారాణి, ఆహార భద్రత విభాగానికి చెందిన అధికారులతో కలసి డాబాగార్డెన్స్‌, పి.ఎం.పాలెం, రుషికొండ తదితర ప్రాంతాల్లోని ఆరు కేంద్రాల్లో తనిఖీలు చేశారు

Published : 21 Jan 2023 06:46 IST

పీఎంపాలెం ప్లాంట్‌లో పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారిణి స్వరూపారాణి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నగర పరిధిలోని నీటిశుద్ధి కేంద్రాల (ఆర్వోప్లాంట్ల) నిర్వహణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం విజిలెన్స్‌ ప్రాంతీయ అధికారి జి. స్వరూపారాణి, ఆహార భద్రత విభాగానికి చెందిన అధికారులతో కలసి డాబాగార్డెన్స్‌, పి.ఎం.పాలెం, రుషికొండ తదితర ప్రాంతాల్లోని ఆరు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఆయా కేంద్రాల్లో నీటిని శుద్ధి చేస్తున్న విధానంపై ఆరా తీశారు. వీటిలో కొన్ని ప్లాంట్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పలు కేంద్రాల నుంచి ఆహారభద్రత అధికారులు 16 లీటర్ల నీటి నమూనాలను సేకరించారు. రికార్డులు నిర్వహించకపోవడం, అనుమతులు తీసుకోకపోవడం, ట్యాంకులను సరిగా శుభ్రం చేయకపోవడంపై నివేదిక రూపొందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని