logo

‘నెరెడ్కో చొరవతో జీవో నంబర్‌ 145 రద్దు’

నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నెరెడ్కో) చొరవతో ప్రభుత్వం జీవో నంబరు 145ను రద్దు చేసినట్లు నెరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనగేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 27 Jan 2023 03:11 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నెరెడ్కో) చొరవతో ప్రభుత్వం జీవో నంబరు 145ను రద్దు చేసినట్లు నెరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనగేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లేఅవుట్లలో అయిదు శాతం భూమిని  ప్రభుత్వానికి ఇవ్వాలన్న నిబంధన విధిస్తూ జీవో జారీ అయిన తరువాత కొత్త లేఅవుట్లకు వచ్చే దరఖాస్తులు భారీగా తగ్గాయన్నారు. ఏటా వంద లేఅవుట్లకు అనుమతిచ్చే వీఎంఆర్‌డీఏ 2022లో కేవలం 9 లేఅవుట్లకు  పరిమితమైందన్నారు. ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వానికి పడిపోతున్న ఆదాయం గురించి సమగ్ర నివేదికతో వినతిని నెరెడ్కో అందజేయగా.. ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో స్థిరాస్తి రంగానికి మేలు:  ప్రైవేటు లే అవుట్లలో ఐదు శాతం ప్రభుత్వానికి కేటాయించాలంటూ ఇచ్చిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమని ‘క్రెడాయ్‌’ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి విన్నవించామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నిర్మాణ రంగానికి, స్థిరాస్తి వ్యాపారులకు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని