logo

మహిళల స్నేహపూర్వక నగరంగా విశాఖ

మహిళల స్నేహపూర్వక నగరంగా విశాఖ గుర్తింపు పొందిందని నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 29 Jan 2023 05:29 IST

పోలీసు కమిషనర్‌ సీపీ శ్రీకాంత్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : మహిళల స్నేహపూర్వక నగరంగా విశాఖ గుర్తింపు పొందిందని నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అవతార్‌ గ్రూపు ఆధ్వర్యంలో ‘టాప్‌ సిటీస్‌ ఫర్‌ ఉమన్‌ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా సర్వే చేపట్టగా విశాఖ దేశంలోనే ఏడో నగరంగా గుర్తింపు పొందిందన్నారు. 200 రకాల అంశాలపై సమాచారం సేకరించి, విశ్లేషించి, సుమారు 20 రోజుల క్రితం సంస్థ ఫలితాలను విడుదల చేసిందన్నారు. పోలీసులకు ప్రస్తుతం అధికారికంగా సమాచారం అందిందన్నారు. విశాఖలో మహిళలు ఉద్యోగాలు చేయటం, స్వేచ్ఛగా తిరగడం, భద్రత విషయాలపై ఈ సంస్థ సర్వే చేపట్టిందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన దిశ యాప్‌తో నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఐ.టి. ఉద్యోగుల భద్రత కోసం అవుట్‌పోస్టుల ఏర్పాటుతో పాటు విశాఖ తీరం వెంట నిరంతర పెట్రోలింగ్‌ జరిగేలా చూస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని