logo

కత్తితో హల్‌చల్‌

చీడికకొత్తూరు గ్రామంలో జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్‌ చేయడంతో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Published : 05 Feb 2023 02:47 IST

బందీగా ఉన్న నిందితుడు సొకేలా అస్త

నక్కపల్లి, న్యూస్‌టుడే: చీడికకొత్తూరు గ్రామంలో జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్‌ చేయడంతో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి మామిడి భద్రం ఇల్లు నిర్మిస్తుండగా.. అక్కడకు సమీపంలో ఉన్న కత్తితో జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి పని చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వీసం కొండయ్య వేలు తెగిపోగా, భద్రంతోపాటు బుద్దరాజుల దారబాబుకు దెబ్బలు తగిలాయి. భయాందోళన చెందిన స్థానికులు నిందితుడిపై తిరగబడి దేహశుద్ధి చేశారు. అనంతరం తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శిరీష సిబ్బందితో అక్కడకు చేరుకుని నిందితుడ్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. నిందితుడి పేరు సొకేలా అస్త అని, జార్ఖండ్‌ రాష్ట్రం బోల్‌భుగల్‌ గ్రామానికి చెందిన వాడని ఎస్సై చెప్పారు. గుల్లిపాడు రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన అతడు అక్కడి నుంచి చీడికకొత్తూరు చేరుకున్నాడని, మానసిక స్థితి  ఎలా ఉందో తెలుసుకోవాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని