రహదారుల కంటే శ్మశానాలే ముద్దు
విశాఖ నగరంలో ప్రధాన, అంతర్గత రహదార్లు దెబ్బతిని నాలుగేళ్లుగా నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అంతర్జాతీయ సదస్సుల పేరిట అభివృద్ధి
రూ.32.31 కోట్ల కేటాయింపు
కార్పొరేషన్, న్యూస్‌టుడే
జోన్-2లోని ఓ శ్మశానంలో జరుగున్న అభివృద్ధి పనులు
విశాఖ నగరంలో ప్రధాన, అంతర్గత రహదార్లు దెబ్బతిని నాలుగేళ్లుగా నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పైపైన మరమ్మతులు చేస్తూ మమ అనిపిస్తోంది. అడిగితే నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. మరో వైపు జీ-20 సన్నాహక సదస్సుల పేరిట నగరంలో శ్మశానాల అభివృద్ధికి నిధులు కుమ్మరిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రూ.75కోట్లు కేటాయిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు ప్రకటించారు. తాజాగా జరిగిన కౌన్సిల్, స్థాయీ సంఘం సమావేశాల్లో సుందరీకరణలో భాగంగా 57 శ్మశానవాటికలను పునరుద్ధరించడానికి రూ.32.31 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. నిధుల్లో సుమారు 50శాతం మేర శ్మశానాలకు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది.
* మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 148 శ్మశాన వాటికలు ఉన్నాయి. వాటిలో 57 ఒకేసారి అభివృద్ధి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రయోజనాన్ని పక్కన పెట్టి అధికారులు, పాలకవర్గ సభ్యులకు అధిక పర్సంటేజీలు వచ్చే పనులను ప్రతిపాదించుకుని లబ్ధి పొందేలా ప్రణాళికలు రచించారని పాలకవర్గంలోని పలువురు ఆరోపిస్తున్నారు.
కౌన్సిల్‌లో రూ.17.25 కోట్లకు..
జీవీఎంసీˆలో ఈనెల 1న నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో 105 అంశాలతో అజెండా రూపొందించగా, అందులో 19 అంశాలకు కేవలం శ్మశాన వాటికలకు సంబంధించినవే ఉన్నాయి. 19 శ్మశాన వాటికలను రూ.17.25 కోట్లతో అభివృద్ధి చేయడానికి సభ్యులు అంగీకారం తెలిపారు. 6వ వార్డులో ఒకదానికి రూ.1.80 కోట్లు, 23వ వార్డులో ఒకదానికి రూ.1.90 కోట్లు, మూడో వార్డులో ఒక దానికి రూ.1.10 కోట్లు, 37వ వార్డులోని ఒక దానికి రూ.1.30 కోట్లు, 79వ వార్డులోని మూడు శ్మశాన వాటికలకు వరుసగా రూ.99.25 లక్షలు, రూ.97.85 లక్షలు, రూ.97.65 లక్షలు కేటాయించారు.
స్థాయీ సమావేశంలో రూ.15.06 కోట్లకు..
ఈ నెల 4న నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశంలో 38 శ్మశానాల అభివృద్ధికి రూ.15.05కోట్లు వెచ్చించనున్నట్లు ప్రతిపాదనలు పెట్టారు. విశాఖలో జీ-20 సన్నాహక సదస్సు, ఇన్ఫినిటీ వైజాగ్ 2023, వైజాగ్ టెక్ సమ్మిట, పెట్టుబడిదారుల సదస్సు మొదలైన ప్రతిష్ఠాత్మక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శ్మశానాల అభివృద్ధికి జీవీఎంసీ చర్యలు తీసుకుందని స్థాయీ సంఘం అజెండాలో అధికారులు పేర్కొనడం గమనార్హం. సమావేశంలో కనీసం చర్చ జరగకుండా ఒకేసారి అన్ని ప్రతిపాదనలను ఆమోదించేశారు.
అంచనాలు పెంచేశారు..
వార్డుల్లో సాధారణంగా ఏ పనైనా ప్రతిపాదించేటప్పుడు సంబంధిత కార్పొరేటర్ అనుమతి ఉండాలి. వర్కుఇన్‌స్పెక్టర్ తయారుచేసిన ప్రతిపాదనలను సహాయ, కార్యనిర్వాహక ఇంజినీర్లు కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అధికారులే అన్నీ తామై వ్యవహరించారు. శ్మశానాల విషయంలో గతంలో రూ.25లక్షల కంటే తక్కువకు ప్రతిపాదించిన ఇంజినీరింగ్ అధికారులు ఇప్పుడు ఒకేసారి రూ.1.90కోట్ల వరకు అంచనాలు తయారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీ-20 సదస్సు పేరుతో శ్మశానాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడంపై మేయరు గొలగాని హరి వెంకట కుమారిని వివరణ కోరగా ప్రభుత్వం నగర సుందరీకరణకు రూ.75కోట్లు ఇస్తుందని, ఆయా నిధులను వినియోగించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రతిపాదించామని చెప్పారు. ఒకేసారి 57 శ్మశానాలను ఎందుకు అభివృద్ధి చేస్తున్నారని ప్రశ్నించగా కార్పొరేటర్ల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని