logo

అప్పన్న సన్నిధిలో... 22న పంచాంగ శ్రవణం

చైత్ర శుద్ధ పాఢ్యమిని పురస్కరించుకుని  శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 22న శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 20 Mar 2023 03:04 IST

సింహాచలం, న్యూస్‌టుడే:  చైత్ర శుద్ధ పాఢ్యమిని పురస్కరించుకుని  శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 22న శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం సంప్రదాయబద్ధంగా జరుగుతుందన్నారు. అనంతరం స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలకు సంబంధించిన పందిరి రాట ఉడుపు ఉత్సవం జరుగుతుందని వివరించారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని పండిత సత్కారం, దాతలకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి సన్నిధిని చేరుతాయని తెలిపారు. ఉత్సవాల అనంతరం స్వామి, అమ్మవార్ల గ్రామ తిరువీధి వైభవోపేతంగా జరుగుతుందని తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని