logo

సమతామూర్తి జీవితం అనుసరణీయం

కులమతాలకు అతీతంగా అందరికీ తిరుమంత్రాన్ని ఉపదేశించిన భగవత్‌ రామానుజాచార్యుల మార్గం అందరికీ అనుసరణీయమని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు

Published : 04 Jun 2023 05:52 IST

విగ్రహానికి పూజలు చేస్తున్న చినజీయర్‌స్వామి

నక్కపల్లి, న్యూస్‌టుడే: కులమతాలకు అతీతంగా అందరికీ తిరుమంత్రాన్ని ఉపదేశించిన భగవత్‌ రామానుజాచార్యుల మార్గం అందరికీ అనుసరణీయమని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. వేంపాడులో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని శనివారం స్వామీజీ ఆవిష్కరించారు. ఆయనకు స్థానికులు పూలతో స్వాగతం పలికారు. ముందుగా వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికులనుద్దేశించి అభిభాషణం చేశారు. మాధవ సేవే మానవసేవని అంతా గుర్తించాలన్నారు. ఉన్నతమైన వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడమే కాదని, అనుసరించగలిగినప్పుడే ఉన్నత స్థానానికి చేరుకోగలమన్నారు. స్వామిని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కలిసి ఆశీర్వాదం పొందారు. వేడుకలో ఉపమాక వెంకన్న ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, పీఏసీఎస్‌ మాజీ ఛైర్మన్‌ అయినంపూడి మణిరాజు, వికాస తరంగిణి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు