logo

జీతాలివ్వండి మహాప్రభో..

వైద్య ఆరోగ్య శాఖ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌.హెచ్‌.ఎం)లో పనిచేస్తున్న సిబ్బందికి ఏప్రిల్‌ 15వ తేదీ దాటినా మార్చి నెల వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Published : 16 Apr 2024 04:06 IST

వైద్య, ఆరోగ్య శాఖ ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది వేడుకోలు

సీతంపేట, న్యూస్‌టుడే : వైద్య ఆరోగ్య శాఖ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌.హెచ్‌.ఎం)లో పనిచేస్తున్న సిబ్బందికి ఏప్రిల్‌ 15వ తేదీ దాటినా మార్చి నెల వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా ఏనాడూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు జరుగుతున్నందున ఇప్పుడైనా ఒకటో తేదీకి జీతాలు తమ ఖాతాల్లో వేస్తారనుకుంటే అలా జరగలేదంటున్నారు.   తమ వేతనాలు అందకుంటే ప్రభుత్వ ఉద్యోగులు  యూనియన్‌ ద్వారా నిరసన తెలియజేస్తారని, తమకు ఆ అవకాశం లేదని సిబ్బంది వాపోయారు. ఉన్నతాధికారులు అడిగిన నివేదిక ఒక్కక్షణం ఆలస్యమైతే తమపై అజమాయిషీ చూపుతారని,  జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే మాత్రం ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర సరకుల కొనుగోలు వంటి వాటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జీతాలు అందించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని