logo

వడగాల్పుల ఉద్ధృతి

జిల్లాలో వడగాలులు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం విశాఖ నిప్పుల కుంపటిని తలపించింది. జిల్లావ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీచాయి.

Published : 17 Apr 2024 04:20 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జిల్లాలో వడగాలులు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం విశాఖ నిప్పుల కుంపటిని తలపించింది. జిల్లావ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీచాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించినవారు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 5.6 డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా పద్మనాభంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని