logo

కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు.

Published : 24 Apr 2024 04:24 IST

మాట్లాడుతున్న తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, పక్కన గణబాబు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు.మంగళవారం బాజీకూడలి సమీప ఆర్‌.ఆర్‌.గ్రాండ్‌ కల్యాణ మండపంలో జిల్లాస్థాయి నాయీబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీభరత్‌ మాట్లాడుతూ... వైకాపా పాలనలో నాయీ బ్రాహ్మణులతో పాటు, ఇతర వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని... కూటమి అధికారంలోకి రాగానే అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ.. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి, కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, కార్పొరేటర్‌ బొమ్మిడి రమణ, సభ్యులు నరవ పైడిరాజు, పి.రవికుమార్‌, డి.రమేశ్‌, ఎం.రమణ, ఎ.మధు, కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని