logo

కోలాహలంగా విష్ణుకుమార్‌రాజు నామినేషన్‌

విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 24 Apr 2024 04:29 IST

భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు

ఆర్వో అఖిలకు నామినేషన్‌ పత్రాల్ని అందజేస్తున్న విష్ణుకుమార్‌రాజు, పక్కన ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, ఎంపీ జీవీఎల్‌, ఉషాకిరణ్‌

రుద్వారా, న్యూస్‌టుడే: విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ దస్తులు, తలపాగాలతో నాయకులు, కార్యకర్తలు సీతమ్మధార అల్లూరి సీతారామరాజు కూడలి మీదుగా ఆర్వో కార్యాలయానికి కాలినడకన చేరుకున్నారు. తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, జనసేన నేత ఉషాకిరణ్‌, సోదరుడు సుబ్బరాజులతో కలిసి వెళ్లి విష్ణుకుమార్‌రాజు ఆర్వో అఖిలకు నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. భారీ సంఖ్యలో కూటమి శ్రేణులు తరలిరావడంతో పసుపు, కాషాయం, తెలుపు రంగులతో సీతమ్మధార ప్రాంతమంతా కళకళలాడింది. ఎన్టీఆర్‌ వేషధారణలో తెదేపా అభిమాని అలరించారు.

నీ నిబంధనలు కట్టుదిట్టం: వైకాపా అభ్యర్థి కేకే రాజు నామినేషన్‌ దాఖలు సమయంలో భారీగా ఆ పార్టీ శ్రేణులు తరలివచ్చిన నేపథ్యంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలీసులు నిబంధనలు కట్టుదిట్టం చేశారు. 100 అడుగుల వెలుపల వరకు నామినేషన్‌ వేసే అభ్యర్థి, మరో నలుగురు తప్ప లోనికి ఎవ్వరూ రాకుండా జాగ్రత్తలు వహించారు. ముందుగా రహదారిపై పెద్ద పెద్ద గేట్లు ఏర్పాటుచేశారు. అటుగా రాకపోకలు సాగించకుండా ఆ రహదారిని మూసివేశారు. దీంతో ఉదయం సమయంలో అటుగా కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారంతా ఆర్వో కార్యాలయం వెనుక నుంచి వెళ్లేందుకు తంటాలు పడ్డారు. వెనుక ఉన్న ఖజానా కార్యాలయానికి వెళ్లేందుకు వచ్చిన వృద్ధుల్నీ అడ్డుకున్నారు. దీంతో వారంతా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని