logo

గ్రామీణులకు సేవ చేయడమే లక్ష్యం

గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే సీఆర్పీఎఫ్‌ లక్ష్యమని ఏ/58 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చంద్రమౌర్య అన్నారు.

Published : 30 Mar 2023 04:39 IST

కుట్టుమిషన్‌ అందిస్తున్న సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చంద్రమౌర్య, ఎస్సై సురేశ్‌, ప్రజాప్రతినిధులు

వెంకటాపురం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే సీఆర్పీఎఫ్‌ లక్ష్యమని ఏ/58 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చంద్రమౌర్య అన్నారు. మండలంలోని ఆలుబాక సీఆర్పీఎఫ్‌ క్యాంపు వద్ద వెంకటాపురం పోలీసులు, సీఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం సివిక్‌ యాక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలకు చేయూత అందించేందుకు గాను కుట్టుమిషన్లు, వైకల్యంతో బాధపడుతున్న వారికి ట్రైసైకిళ్లు, పలువురికి సైకిళ్లను పంపిణీ చేశారు. వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీఎస్‌ ఓబయ్య, ఇన్‌ఛార్జి ఎస్సై సురేశ్‌, సర్పంచులు పూజారి ఆదిలక్ష్మీ, కుంజ గంగ, కారం కన్నయ్య, సారయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని