logo

3వ లోక్‌సభ: గెలుపోటముల్లో ఓట్ల తేడా స్వల్పమే..

వరంగల్‌ స్థానం నుంచి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) అభ్యర్థి బాకర్‌ అలీ మిర్జా విజయం సాధించారు. తన సమీప సీపీఐ అభ్యర్థి రామనాథంపై 736 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగింది.

Published : 17 Apr 2024 05:17 IST

గుర్తు చేసుకుందాం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: మూడో లోక్‌సభను గుర్తు చేసుకుందాం. ఈ ఎన్నికలు 1962లో జరిగాయి. వరంగల్‌, మహబూబాబాద్‌లో స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 

వరంగల్‌ స్థానం నుంచి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) అభ్యర్థి బాకర్‌ అలీ మిర్జా విజయం సాధించారు. తన సమీప సీపీఐ అభ్యర్థి రామనాథంపై 736 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. జనసంఘ్‌(జేఎస్‌) నుంచి పోటీ చేసిన ఎల్‌ఎస్‌ రాజు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తం 4,08,061 ఓట్లకు గాను 2,52,243 ఓట్లు పోలయ్యాయి. 61.82 పోలింగ్‌ శాతం నమోదైంది.

 మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా ఇటికాల మధుసూదనరావు విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి తీగల సత్యనారాయణరావుపై 13,576 ఓట్ల ఆధిక్యం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కటంగూరి నరసింహారెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. మొత్తం 4,26,441 ఓట్లకు గాను 2,88,681 ఓట్లు పోలయ్యాయి. 67.70 శాతం పోలింగ్‌ నమోదైంది. మధుసూదనరావు 1957, 1962 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వరసగా రెండుసార్లు గెలుపొంది చరిత్ర సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని