logo

అటవీ సంరక్షకులు..!

వేసవి తీవ్రత దృష్ట్యా అభయారణ్యంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ యంత్రాంగం శ్రమిస్తోంది. కన్నాయిగూడెం మండలం అటవీ శాఖ ఉత్తర రేంజ్‌ పరిధిలో ప్రస్తుతం ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే స్పందిస్తూ అడవిని కాపాడుతున్నారు.

Published : 18 Apr 2024 06:04 IST

కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో మంటలార్పుతున్న అటవీ సిబ్బంది

కన్నాయిగూడెం, న్యూస్‌టుడే: వేసవి తీవ్రత దృష్ట్యా అభయారణ్యంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ యంత్రాంగం శ్రమిస్తోంది. కన్నాయిగూడెం మండలం అటవీ శాఖ ఉత్తర రేంజ్‌ పరిధిలో ప్రస్తుతం ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే స్పందిస్తూ అడవిని కాపాడుతున్నారు. ఏటూరునాగారం అటవీ డివిజన్‌లోని రోహీర్‌ నుంచి తుపాకులగూడెం వరకు బీట్‌, సెక్షన్‌ అధికారులు నిరంతరం బృందాలుగా గస్తీ తిరుగుతున్నారు. ప్రధాన రహదారుల పక్కన ఇటీవల చోటు చేసుకుంటున్న కార్చిచ్చుల వద్దకు సకాలంలో చేరుకుని నష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు

మండలంలోని ఉత్తర రేంజ్‌ పరిధిలో ఉన్న వన్యప్రాణులు వేసవిలో మనుగడ సాగించడానికి పలుచోట్ల నీటి ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్వాయి, ఐలాపూర్‌, భూపతిపురం, చిట్యాల తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నీటి కుంటలు, వాగుల వద్ద చెలమలు, సిమెంటు రింగులు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వన్యప్రాణుల ఉనికిని తెలుసుకోవడానికి దాదాపు  పది నిఘా నేత్రాలను అమర్చారు. ఈ కెమెరాల్లో జింకలు, దుప్పులు, అడవి బర్రెలు, తదితర జంతువులు నీటిని తాగుతున్న దృశ్యాలు నమోదయ్యాయి.


ప్రజల సహకారం అవసరం

- బాలరాజు, ఉత్తర రేంజ్‌ అధికారి

అటవీ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి. ఎక్కడైనా మంటలు కన్పిపిస్తే సమాచారం ఇవ్వాలి. అడవితో పాటు వన్యప్రాణులను కాపాడడానికి తీవ్రంగా కష్టపడుతున్నాం. వాహనదారులు వెళ్లేటప్పుడు సిగరెట్లు తాగి పడేయం మానుకోవాలి. ఒక్కరి నిర్లక్ష్యం అటవీ సంరక్షణకు ప్రశ్నార్థకంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని