logo

విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి

ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, నరసాపురం పార్లమెంట్‌ వైకాపా ఇన్‌ఛార్జి గోకరాజు వెంకట కనక రంగరాజు అన్నారు. శుక్రవారం వారు దుంపగడప గ్రామంలోని ఏకేపీఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వీవీ గిరి డిగ్రీ ప్రభుత్వ కళాశాలకు చెందిన మొలుగు

Published : 15 Jan 2022 01:41 IST


ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శివరామరాజు, రంగరాజు తదితరులు

దుంపగడప (ఆకివీడు), న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, నరసాపురం పార్లమెంట్‌ వైకాపా ఇన్‌ఛార్జి గోకరాజు వెంకట కనక రంగరాజు అన్నారు. శుక్రవారం వారు దుంపగడప గ్రామంలోని ఏకేపీఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వీవీ గిరి డిగ్రీ ప్రభుత్వ కళాశాలకు చెందిన మొలుగు రఘునాథాచార్యులు క్రీడా మైదానంలో దివగంత కలిదిండి అప్పల సూర్యనారాయణరాజు (ప్లీడర్‌) జ్ఞాపకార్థం నిర్మించిన ‘స్పోర్ట్స్‌ సెంటర్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలుత ఇక్కడ ఏర్పాటు చేసిన క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, త్రోబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ తదితర 18 క్రీడాకోర్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. కళాశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పీబీ ప్రతాప్‌కుమార్‌, నంబూరి వెంకట రామరాజు (తాడినాడ బాబు), పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌ అధ్యక్షుడు గొంట్లా కృష్ణమూర్తి, కార్యదర్శి నేరెళ్ల రామచంచయ్య, వైద్యుడు ఎంవీఎస్‌ రాజు, మోటుపల్లి గంగాధరరావు, మోరా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని