logo

పెనుగొండలో శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు

పెనుగొండలోని సుప్రసిద్ధ నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి క్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో జీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 26 Sep 2022 04:44 IST

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండలోని సుప్రసిద్ధ నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి క్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో జీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వాసవీ కన్యకాపరమేశ్వరి, మహిషాసురమర్దని అమ్మవార్లు 26న శ్రీబాల, 27న రాజరాజేశ్వరి, 28న లలితాదేవి, 29న అన్నపూర్ణ, 30న శ్రీలక్ష్మి, 1న గాయత్రి, 2న సరస్వతి, 3న దుర్గా, 4న మహిషాసురమర్దని, 5న నిజరూపం అలంకరణలో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా నగరేశ్వరస్వామికి నిత్యం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అలంకరణ, వేదపారాయణ, సూర్య నమస్కారాలు, మహాలింగార్చన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆలయ ఛైర్మన్‌ కోట్ల రామకృష్ణమోహనరావు మాట్లాడుతూ భక్తులు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
* స్థానిక వాసవీ శాంతిధాంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 26 నుంచి అక్టోబరు 5 వరకు నిర్వహించనున్నట్లు అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ పి.ఎన్‌.గోవిందరాజులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని