logo

సమస్యలు వినిపించే అవకాశమేదీ!

ప్రభుత్వం తరఫున అధికారులు నిర్వహించే జిల్లా స్థాయి సమావేశాల్లో రైతుల సమస్యలు వినిపించే అవకాశం కల్పించాలని ఏపీ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి పాతపాటి మురళీరామరాజు కోరారు.

Published : 04 Feb 2023 05:05 IST

ఐక్యత చాటుతున్న రైతు కార్యాచరణ సమితి ప్రతినిధులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం తరఫున అధికారులు నిర్వహించే జిల్లా స్థాయి సమావేశాల్లో రైతుల సమస్యలు వినిపించే అవకాశం కల్పించాలని ఏపీ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి పాతపాటి మురళీరామరాజు కోరారు. భీమవరంలో శుక్రవారం జరిగిన సమితి సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగునీరు, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరిగినప్పుడు తమకు ఆహ్వానం ఉండేదన్నారు. నూతన జిల్లా ఏర్పడ్డాక అలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నవారు అధికారిక సమావేశాల్లో రైతుల సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉండదన్నారు. సమావేశంలో సంఘ నాయకులు తమ్మినీడి నాగేశ్వరరావు, గంటా సుందరకుమార్‌, సీతారామరాజు, నల్లం నాగేశ్వరరావు, వడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని