logo

సౌకర్యాలని మోత.. చూస్తే మూత

‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు, వసతి గృహాలకు అన్ని సౌకర్యాలు కల్పించి తీర్చిదిద్దుతామని వైకాపా ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా..క్షేత్రస్థాయిలో అవేమీ కానరావడం లేదు.

Published : 27 Mar 2024 04:04 IST

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు, వసతి గృహాలకు అన్ని సౌకర్యాలు కల్పించి తీర్చిదిద్దుతామని వైకాపా ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా..క్షేత్రస్థాయిలో అవేమీ కానరావడం లేదు. ఏళ్లు గడుస్తున్నా పరిష్కరించకపోవడం, కనీస మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు వసతి గృహాల నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో ముదినేపల్లిలోని రెండు కళాశాలల వసతిగృహాలు మూతబడ్డాయి. కైకలూరు నియోజకవర్గంలోనే ముదినేపల్లిలో పాలిటెక్నిక్‌, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, జూనియర్‌, డిగ్రీ కళాశాలలున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ముదినేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర, బాలికల వసతిగృహాలను ప్రారంభించింది. ప్రారంభంలో అన్ని వసతులు ఉండటంతో సుమారు 100 మంది  ఉండేవారు. ప్రస్తుతం ఈ గృహాల్లో ఏర్పాట్లు చేయకపోవడం, సమస్యల పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులు వచ్చి వెళ్లిపోతున్నారు. పలువురు గుడివాడలోని వసతిగృహాల్లో చేరారు. దీనిపై బాలుర వసతిగృహ అధికారి అప్పలస్వామిని సంప్రదించగా.. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో గత డిసెంబరు నుంచి మూసివేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని