logo

ఆరోగ్య కేంద్రాలకు.. విద్యుత్తు కోత!

పేదలకు సత్వర వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో మూడు నెలల కిందటే విద్యుత్తు సంస్థ అధికారులు ఫ్యూజ్‌లు పీకేశారు.

Published : 27 Mar 2024 04:11 IST

భారీగా పేరుకుపోయిన బకాయిలు

ఫ్యూజు పీకేసిన విద్యుత్తు సంస్థ సిబ్బంది

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: పేదలకు సత్వర వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో మూడు నెలల కిందటే విద్యుత్తు సంస్థ అధికారులు ఫ్యూజ్‌లు పీకేశారు. ఆనాటి నుంచి ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులు ఏదోలా కాలం నెట్టుకొస్తున్నారు. పెనుగొండ మండలంలోని దొంగరావిపాలెం ఆరోగ్య ఉప కేంద్రానికి రూ.లక్షకు పైగా బిల్లు వచ్చింది. ములపర్రు రూ.49 వేలు, నడిపూడి రూ.23 వేలు, దేవ రూ.21 వేలు, ఇలపర్రు రూ.25 వేలు వరకు వచ్చాయి. ఇలా ప్రతి కేంద్రంలో అధిక బిల్లులు రావడంతో విద్యుత్తు సంస్థ అధికారులు సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి ఉక్కబోత తప్పటం లేదు. ఈ పరిస్థితిపై సిద్ధాంతం పీహెచ్‌సీ వైద్యాధికారిణి సుప్రియను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా గతంలో ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక బడ్జెట్‌ వచ్చేదన్నారు. ప్రస్తుతం రాక బిల్లులు ఆగిపోయాయని, విద్యుత్తు సరఫరా నిలిపివేయడంపై ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని