logo

బొబ్బిలి వంతెన బోరుమంటోంది!

గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Published : 24 Apr 2024 04:11 IST

ఈనాడు, ఏలూరు. గణపవరం, న్యూస్‌టుడే: గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇరుపక్కలా రక్షణ గోడలు పడిపోయి, శ్లాబు అడుగుభాగం దెబ్బతింది. వంతెన కాలిబాటపై వేసిన సిమెంట్‌ పలకలు విరిగి.. పెద్దపెద్ద రంధ్రాలు పడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. గతంలో పాదచారులు నడిచి వెళ్తూ వంతెనపై నుంచి కాలువలో పడి కొట్టుకుపోయిన సంఘటనలు జరిగాయి. కనీస మరమ్మతులను కూడా యంత్రాంగం చేపట్టడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని